Raipur, Jan 9: ఢిల్లీలోని (Delhi) ఓ యువతిని కారు (Car) ఈడ్చుకెళ్లిన ఘటన మరువకముందే.. అలాంటి ఘటనలు ఇటీవల కుప్పలుతెప్పలుగా వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. స్కూటీపై (Scooty) వెళ్తున్న భార్యాభర్తలను (Couple) ఓ కారు ఢీకొట్టింది. ఆ తర్వాత 300 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో చోటు చేసుకుంది.
దుర్గ్ పోల్‌సాయిపరా నివాసి జ్ఞాన్‌చంద్ లేఖానీ (56) తన భార్య వందనా లేఖానీ (45 ఏళ్లు)తో కలిసి స్కూటీలో రాజ్‌నంద్‌గావ్‌కు వెళ్లారు. అక్కడ అతను తన పరిచయస్తుల స్థలంలో ఒక సంగీత కచేరీలో పాల్గొన్నారు. భార్యాభర్తలిద్దరూ రాజ్‌నంద్‌గావ్ నుంచి కోటవైపు వస్తున్నారు. అర్థరాత్రి 12.30 గంటలకు శివనాథ్ ఓవర్ బ్రిడ్జిపైకి రాగానే ముందు నుంచి కారు ఢీకొట్టింది. అనంతరం భార్యాభర్తలిద్దరినీ దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు.. వంతెన పక్క గోడను ఢీకొట్టింది.
మహిళలు చదువుకుంటేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుందన్న నితీశ్ కుమార్.. బీజేపీ ఫైర్.. వీడియోతో
ఘటన అనంతరం కారులో ఉన్నవారు కారు వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పుల్గావ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన జంటను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారిద్దరూ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.