Tamilnadu Viral: కారు డ్రైవర్ ఖాతాలో అకస్మాత్తుగా రూ.9 వేల కోట్లు జమ.. నిజానిజాలు తేల్చేందుకు స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ.. ఇంతలో బ్యాంకు నుంచి ఫోన్, మొత్తం డబ్బు వాపసు ఇవ్వాలన్న అధికారులు.. ఆ తర్వాత ఏం జరిగింది??
Credits: X

Newdelhi, Sep 22: తమిళనాడుకు (Tamilnadu) చెందిన ఓ కారు డ్రైవర్‌ (Car Driver) కు వింత అనుభవం ఎదురైంది. చెన్నైకి చెందిన రాజ్‌కుమార్ (Raj Kumar) కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ కారు డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అతడి మొబైల్‌ కు తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు నుంచి డబ్బు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూస్తే ఏకంగా రూ. 9 వేల కోట్లు కనిపించింది. ఇది నమ్మలేకపోయిన అతడు నిజానిజాల్ని నిర్ధారించుకునేందుకు తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. చివరకు అది నిజమని నిర్ధారించుకున్నాక సంబరంలో మునిగితేలాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు మిగల్లేదు. ఆ తరువాత బ్యాంకు వారు రాజ్‌కుమార్‌ కు ఫోన్ చేసి పొరపాటున రూ.9 వేల కోట్లు బదిలీ అయ్యిందని వివరించారు. తన స్నేహితుడికి పంపిన డబ్బుతో పాటూ మొత్తం సొమ్మును తమకు అప్పగించాలన్నారు.

Norman Borlaug Award: భారతీయ మహిళా శాస్త్రవేత్త స్వాతి నాయక్‌ కు నార్మన్ బోర్లాగ్ అవార్డ్.. వరి సాగు చేసే చిన్నరైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసిన స్వాతి

న్యాయవాదులతో ఇలా..

దీంతో రాజ్‌కుమార్ న్యాయవాదులను సంప్రదించాడు. వాళ్లు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడటంతో రూ.21 వేలు వెనక్కు ఇవ్వాల్సిన పనిలేదని, పైగా వాహన రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది.

Changes in Vande Bharat Express: సీట్ల పుష్ బ్యాక్ పెంపు, ఫుట్‌ రెస్ట్‌ కు మెరుగులు, ఏసీ సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు.. ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు వందేభారత్‌ రైళ్లలో రైల్వేశాఖ 25 కీలక మార్పులు