Credits: X

Newdelhi, Sep 22: భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్‌ (Dr. Swathi Nayak) నార్మన్ బోర్లాగ్ అవార్డు (Norman Borlaug Award)కు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో స్వాతి నాయక్‌ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ (World Food Prize Foundation) ఈ అవార్డును ప్రకటించింది. ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో (ఐఆర్ఆర్ఐ-IRRI) శాస్త్రవేత్తగా ఉన్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు.

Changes in Vande Bharat Express: సీట్ల పుష్ బ్యాక్ పెంపు, ఫుట్‌ రెస్ట్‌ కు మెరుగులు, ఏసీ సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు.. ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు వందేభారత్‌ రైళ్లలో రైల్వేశాఖ 25 కీలక మార్పులు

Aadhaar-Voter ID Linking Row: ఓటరు ఐడీకి ఆధార్ లింక్ తప్పనిసరి కాదు, సుప్రీంకోర్టుకు తెలిపిన ఎన్నికల కమిషన్, ఫారమ్ 6, 6Bలో మార్పులు చేస్తామని వెల్లడి

ఏమిటీ అవార్డు?

హరిత విప్లవ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ ఇ. బోర్లాగ్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఆకలిని నిర్మూలించి, ఆహారభద్రతకు కృషి చేసే 40 ఏళ్లలోపు వయసున్న శాస్త్రవేత్తలకు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తారు.