Hyderabad, Sep 22: అత్యాధునిక వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో (Trains) ప్రయాణం ఇకపై మరింత సౌకర్యవంతంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల (Telugu States) నుంచి మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వందేభారత్ రైళ్లల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మొత్తం 25 మార్పులు చేసినట్టు రైల్వే శాఖ (Railway) పేర్కొంది. సీట్లలో మరింత వెనక్కు వాలి నిద్రపోయేందుకు వీలుగా పుష్ బ్యాక్, సీట్ల మెత్తదనాన్ని పెంచారు. మొబైల్ చార్జింగ్ పాయింట్, ఫుట్ రెస్ట్ లోనూ మార్పులు చేశారు. మరుగుదొడ్లలో వెలుతురును, వాష్‌బేసిన్ల లోతును కూడా పెంచారు. ఏసీ మరింత సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు చేశారు.
మార్పులు ఎందుకంటే?
ఎనిమిది గంటల పాటు కూర్చుని ప్రయాణం చేయాల్సి రావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారన్న ఫిర్యాదులతో రైల్వే ఈ చర్యలు తీసుకుంది.