Channai, July 3: చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులు పోలాండ్ నుండి వచ్చిన పోస్టల్ పార్శిల్‌లో 107 లైవ్ స్పైడర్స్ ను (Live Spiders Inside Air Parcel) పెట్టెలలో నిల్వ ఉంచినట్లు కనుగొన్నారు. పోలాండ్ నుంచి చెన్నై విమానాశ్రయంలోని (Chennai international airport) విదేశీ పోస్టాఫీసుకు ఓ పార్శిల్ వచ్చింది. అది తమిళనాడులోని అరుపుకొటాయ్‌కి చెందిన ఓ వ్యక్తి పేరుమీద వచ్చిది. ఆ పార్శిల్‌ను విప్పి చూడగా అందులో 107 సాలె పురుగులను గుర్తించినట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. థర్మాకోల్ పెట్టెలో మొత్తం 107 ప్లాస్టిక్ వయల్స్‌లో (107 live spiders) వాటిని భద్రంగా ఉంచి పంపినట్లు తెలుస్తోంది. ప్రతి వయల్‌లోని సాలెపురుగు బతికే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దీని గురించి తెలుసుకోవడానికి, వాటిని పరిశీలించడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలను పిలిచారు. "వాటి నిర్మాణ పరీక్షల ఆధారంగా సాలెపురుగులు ఫోనోపెల్మా మరియు బ్రాచిపెల్మా జాతికి చెందినవని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఇవి CITES లిస్టెడ్ టరాన్టులాస్, దక్షిణ, మధ్య అమెరికా మరియు మెక్సికోకు చెందినవి" అని ఒక అధికారి తెలిపారు. దక్షిణ, మధ్య అమెరికాతోపాటు మెక్సికోలో ఇవి కనిపిస్తాయని వారు తెలిపారు. వీటి దిగుమతికి సంబంధించి డీజీఎఫ్‌టీ లైసెన్స్, తదితర పత్రాలు లేనందున.. ఇది దిగుమతి చట్ట విరుద్ధమని అధికారులు వెల్లడించారు
దేశీ వాణిజ్య చట్టం 1962 కింద అధికారులు ఆ సాలె పురుగులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ పార్శిల్‌ను పోలెండ్‌కు తరలించాలని నిశ్చయించి పోస్టల్ అధికారులకు అప్పగించారు. అయితే వాటిని ఎవరు దిగుమతి చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నారు? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టినట్లు విమాశ్రయ అధికారులు వెల్లడించారు.