ID (Image Credits: Google)

NewDelhi, September 18: రవాణా వ్యవస్థకు సంబంధించి పౌరులకు సులభతర సేవలు అందించే ఉద్దేశంతో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలతో నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ (Vehicle Registration), పర్మిట్, యాజమాన్య హక్కుల బదిలీ తదితర 59 రకాల సేవలన్నీ ఇకపై ఆన్ లైన్ లోనే పొందవచ్చు. గతంలో ఈ సేవలకు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్రం నూతన విధానంతో వాహనదారులు ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పనుంది. ఆధార్ కార్డు (Adhaar Card) ఉంటే చాలు... లెర్నర్ లైసెన్స్ అప్లికేషన్, రీప్లేస్ మెంట్, రెన్యువల్, డ్రైవింగ్ లైసెన్స్ సవరణలు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, వాహన రిజిస్ట్రేషన్ అప్లికేషన్, వాహన నెంబరు (Vehicle Number) కొనసాగింపు, ఓనర్ షిప్ ట్రాన్స్ ఫర్ వంటి సేవలన్నింటినీ ఇంటి వద్ద కూర్చునే పొందవచ్చు.

చైనాలో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 42 అంతస్తుల టెలికం భవనం.. వీడియో ఇదిగో!

ఈ విధానంతో పౌరుల సమయం ఆదా అవుతుందని, ఆర్టీవో ఆఫీసులకు ప్రజల తాకిడి తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తద్వారా ఆర్టీవో ఆఫీసుల పని సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంది. ఆధార్ నెంబరు లేనివాళ్లు ఇతర గుర్తింపు పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించి పై సేవలను పొందవచ్చని తెలిపింది.