Newdelhi, June 25: రైలు ప్రయాణ (Train Journey) సమయంలో బ్యాగును (Bag) పోగొట్టుకున్న ఓ ప్రయాణికురాలికి రైల్వే శాఖ (Indian Railway) పరిహారం చెల్లించాల్సిందేనని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2016లో ఢిల్లీ నుంచి ఇండోర్ కు రైలు ప్రయాణం చేస్తూ ఓ మహిళ తన బ్యాగును పోగొట్టుకుంది. బ్యాగులో రూ.80 వేల విలువైన వస్తువులు ఉన్నాయని సంబంధిత రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది సేవా లోపం కిందికే వస్తుందని, తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని కోరింది. రైల్వే అధికారులు నిరాకరించారు. దీంతో సదరు ప్రయాణికురాలు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది. సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ప్రయాణికులు వారి లగేజీ బాధ్యత రైల్వేదేనని కమిషన్ ముందు తన వాదన వినిపించింది. అయితే, ఈ వాదనలను రైల్వే శాఖ తోసిపుచ్చింది. ప్రయాణ సమయంలో ఆమె నిర్లక్ష్యం వల్లే బ్యాగు చోరీకి గురైందని, లగేజీ కోసం ప్రత్యేకంగా ఎటువంటి బుకింగ్ చేసుకోలేదని రైల్వేశాఖ వాదించింది.
Observing that there was #negligence and deficiency in services by the #IndianRailway, a consumer commission here has directed its general manager concerned to pay more than Rs 1.08 lakh to a passenger whose luggage was #stolen during a journey.https://t.co/sFTJkU0AsC
— Deccan Herald (@DeccanHerald) June 24, 2024
తీర్పు ఏమిటంటే??
ఇరువురి వాదనలు విన్న కమిషన్.. రైల్వే శాఖ వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో రైల్వే శాఖ నిర్లక్ష్యం, సేవా లోపం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. బాధితురాలు కోల్పోయిన రూ.80 లతో పాటు పరిహారంగా రూ.20 వేలు, న్యాయప్రక్రియ ఖర్చుల కింద రూ.8 వేలు.. మొత్తంగా రూ.1.08 లక్షలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.