Bhubaneshwar, May 15: కరోనా ఫస్ట్ వేవ్ పెద్దవారి మీద ప్రభావం చూపితే..సెకండ్ వేవ్ యువత, చిన్నారుల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఒడిషాలో ఆశ్చర్యపరిచే ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన 15 రోజులకే కరోనా బారినపడిన నవజాత శిశువు (COVID-infected Newborn) పది రోజుల్లోనే మహమ్మారిపై విజయం సాధించింది. ఆ నవజాత శిశువుకు తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన 15 రోజులకే కరోనా మహమ్మారి (Youngest COVID survivor) సోకింది. రోజుల వయసున్న ఆ చిన్నారి కరోనాను జయించింది.
పూర్తి వివరాల్లోకెళితే.ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన అగర్వాల్ భార్య ప్రీతి అగర్వాల్ (29) రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. ఆ తర్వాత శిశువుకు జ్వరం రావడంతో అగర్వాల్ దంపతులు భువనేశ్వర్‌లోని జగన్నాథ్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. నవజాత శిశువుకు చికిత్స చేసిన నియోనటాలజిస్ట్ డాక్టర్ అరిజిత్ మోహపాత్ర మాట్లాడుతూ శిశువును తమ వద్దకు తీసుకువచ్చినప్పుడు అధిక జ్వరంతో, తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుందని పేర్కొన్నారు. దీనికి తోడు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.
పలు చికిత్సలు చేసి, చివరికు వెంటిలెటర్‌పై ఉంచామని, రెమ్‌డెసివిర్‌తో సహా ఇతర యాంటీబయాటిక్స్ ఇచ్చినట్లు చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో రెమ్‌డెసివిర్‌ను ఇంజెక్షన్ ఇచ్చామని, ఎందుకంటే కొత్తగా పుట్టిన శిశువులపై పరిశోధనలు జరుగలేవని చెప్పారు. చివరకు చికిత్స సానుకూలంగా స్పందించి, కోలుకుందని (COVID-infected Newborn Recovers Fully) మోహాపాత్ర పేర్కొన్నారు.
Here's Video
One month old Gudia, who got infected by #Covid19 recovers fully after 10 days on ventilator in a hospital in #Bhubaneswar. Nothing short of a miracle, says Dr Arjit Mohapatra who treated her.#IndiaFightsCOVID19 pic.twitter.com/Duaxejf3Re
— SUSHIL PANDEY (@sushilemedia) May 14, 2021
ఈ కేసు నా జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం’ అవుతుందని ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ పేర్కొన్నారు. పుట్టిన వెంటనే శిశువు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించడంతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల్లో శిశువు కోలుకుందని, ఇప్పుడు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాగా అప్పటికే ఆ కుటుంబంలో చాలామందికి కరోనా లక్షణాలున్నాయి. దీంతో.. ఆ పాపకు కూడా వైరస్ సోకింది.