Dead | Representative Image (Photo Credit: Pixabay)

Newdelhi, Dec 17: టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందుతున్నా.. కొందరు ఇంకా మూఢ నమ్మకాలను (Witch craft) విడిచిపెట్టడం లేదు. ఇదీ అలాంటి ఘటనే.  సంతానం కోసం ఓ మంత్రగాడి మాట విన్న ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, విచిత్రంగా ఆ కోడిపిల్ల మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఛత్తీస్‌ గఢ్‌ (Chhattisgarh) లోని ఛిండ్కా గ్రామంలో ఈ వింత ఘటన జరిగింది. బాధితుడిని ఆనంద్‌ యాదవ్‌(35)గా గుర్తించారు.  కాగా మృతుడి గొంతు వద్ద కోయగా ప్రాణంతో ఉన్న కోడిపిల్ల ఇరుక్కోని ఉందని వైద్యులు గుర్తించి బయటకు తీశారు.

అమెరికా స్కూల్‌ లో కాల్పుల మోత.. టీచర్‌ సహా ఐదుగురు విద్యార్థులు మృతి

20 సెంటీమీటర్ల  కోడిపిల్ల

20 సెంటీమీటర్ల పొడవున్న ఈ కోడిపిల్ల ఆనంద్‌ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి అందక మరణించాడని వైద్యులు తేల్చారు. తన కెరీర్‌లో 15 వేల పోస్టుమార్టంలు చేశానని, ఇలాంటి కేసు మాత్రం ఎన్నడూ చూడలేదని వైద్యుడు ఒకరు పేర్కొన్నారు.

పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!