Newyork, Dec 17: అగ్రరాజ్యం అమెరికా (America) మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. విస్కాన్సిన్ లోని మాడిసన్ లో ఉన్న అబండంట్ క్రిస్టియన్ స్కూల్ లో 12వ తరగతి విద్యార్థి తుపాకీతో (School Shooting) విరుచుకుపడ్డాడు. దీంతో టీచర్ సహా ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో నిందితుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో స్కూల్ లో 400 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. గాయపడినవారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Another day, another shootout in the USA. 5 dead. This times its a bank. Nowadays they call the shooter an "active aggressor". pic.twitter.com/sU7FFv2x1O
— The Hawk Eye (@thehawkeyex) April 10, 2023
కాల్పుల ఘటనలు నిత్యకృత్యం
అమెరికాలోని స్కూల్స్ లో కాల్పుల ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అక్కడి స్కూళ్లలో 322 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 1966 తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం.