Shimla, Feb 17: పావలా చికెన్ కు బారాణా మసాలా అన్నట్టు లక్ష రూపాయల స్కూటీకి (Scooty) కోటి రూపాయలు పెట్టి ప్యాన్సీ నంబరు (Fancy Number) కోసం వెంపర్లాడారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లాలో (Shimla) రవాణా శాఖ HP999999ను వేలానికి ఉంచింది. దీని కనీస ధరను రూ. 1000గా నిర్ణయించింది.
ఈ నంబరును దక్కించుకునేందుకు ఔత్సాహిక వాహనదారుల మధ్య పోటీ మొదలైంది. మొత్తం 26 మంది బిడ్డింగులో పాల్గొన్నారు. అందులో ఓ వ్యక్తి అక్షరాలా కోటీ పదకొండు వేల (రూ.1,00,11,000) రూపాయలకు బిడ్ దాఖలు చేశాడు. ఇంతా చేస్తే ఆ వ్యక్తి వద్ద ఉన్నది బెంజ్, ఆడి లాంటి ఖరీదైన కారు కాదు.. ఓ స్కూటీ కోసం. దాని ధర లక్ష మాత్రమే. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
1.1cr bid for fancy vehicle registration number in Himachal Pradesh https://t.co/QF2sPezyqJ
— TOI India (@TOIIndiaNews) February 16, 2023