New Delhi, August 16: అఖిల భారత ఫుట్‌‍బాల్ సమాఖ్యకు(ఏఐఎఫ్‌ఎఫ్‌) (AIFF) ఫిఫా నుంచి ఊహించని షాక్‌ తగిలింది. ఏఐఎఫ్‌ఎఫ్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) (FIFA)మంగళవారం ప్రకటించింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయటి వ్యక్తుల (థర్డ్‌ పార్టీ) (Third Party) ప్రమేయం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సస్పెన్షన్‌ వేటు తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా పేర్కొంది.

జింబాబ్వే పర్యటనకు దూరంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌.. భారత అభిమానుల్లో కలవరం..

ఏఐఎఫ్‌ఎఫ్‌పై సస్పెన్షన్‌ వేటు కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌లో (11-30) భారత్‌ వేదికగా జరగాల్సిన అండర్-17 మహిళల ఫిఫా ప్రపంచకప్ (World Cup) రద్దైంది. తదుపరి వేదికపై ఫిఫా త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశముంది.