Violence in Manipur (Image Credits - Twitter/@MangteC)

Newdelhi, Aug 5: హింసతో (violence) గత మూడు నెలలుగా తగలబడిపోతున్న మణిపూర్‌ (Manipur) ఇంకా కుదుటపడటం లేదు. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగ (Meitei Community)కు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. మెయిటీ ప్రాంతాల నుంచి బఫర్ జోన్‌ను దాటుకుని  వచ్చిన కొందరు వ్యక్తులు ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.

Onion Price: టమాటా తర్వాత ఇక ఉల్లివంతు.. వచ్చే నెలలో రూ. 70కి చేరుకోనున్న ధర.. ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ నివేదిక.. సరఫరా-డిమాండ్ మధ్య తేడానే కారణం

ఇదే జిల్లాలో రెండ్రోజుల క్రితం గొడవలు

ఇదే జిల్లాలో రెండ్రోజుల క్రితం మెయిటీ తెగ ప్రజలు, సాయుధ బలగాల మధ్య జరిగిన గొడవల్లో 17 మంది గాయపడ్డారు. కాగా, మణిపూర్‌ లో దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.

Parle-G Biscuits: పార్లే-జి బిస్కెట్‌ ప్యాక్‌ పై ఉండే చిన్నారి ఎవరు? సీక్రెట్ రివీల్ చేసిన కంపెనీ మేనేజర్‌