New Challenge on internet today: ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా? సరికొత్త కాన్సెప్ట్‌‌లతో ఇంటెర్నెట్‌లో రోజుకో కొత్త ఛాలెంజ్, ప్రస్తుతం ఏ ఛాలెంజ్ ట్రెండింగ్‌లో ఉందో చూడండి.
Top trending social media challenges

Online Challenges: గతంలో ఏదైనా సాధించటానికి, లేదా పైచేయి సాధించటానికి ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకునేవారు. అందులో గెలిచిన వారు స్టార్ అయ్యేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో(Social Media)  పిచ్చిగా ఏదో వీడియో చేసేసి, దానికో హాష్‌ట్యాగ్ (#Hashtag) తగిలించి ఛాలెంజ్ అని పెట్టగానే ఒకరిని చూసి ఒకరు పిచ్చిపిచ్చిగా ఆ ఛాలెంజ్‌లు స్వీకరిస్తూ తమ స్టైల్లో, క్రియేటివ్‌గా, వైరైటీగా వీడియోలు చేసేస్తున్నారు. ఆ వీడియోలు వైరస్ కంటే వేగంగా వైరల్ అయి ఆన్‌లైన్‌లో భూకంపాలను సృష్టిస్తున్నాయి (Trend). ఇలానే కొంతమంది ఓవర్‌నైట్ లోనే స్టార్లు కూడా అయిపోతున్నారు. ఇంకొంత మంది బాగా రిస్క్‌లు చేసి కాళ్లు చేతులు విరగొట్టుకోవటమో, ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది.

ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ వచ్చిన దగ్గర్నుంచీ యూత్. క్షమించాలి యూత్ అనే కాదు పిల్లల నుంచి ముసలి వాళ్లదాకా ఎవ్వరూ తగ్గడం లేదు. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఎడాపెడా ఏవో వీడియోలు, ఛాలెంజ్‌లు చేసుకుంటూ అదే లోకంలో బిజీబిజీగా గడిపేస్తున్నారు. చిత్రమేమంటే విపరీతమైన స్టార్‌డమ్ ఉన్న సెలబ్రిటీలు కూడా ఈ ఛాలెంజ్‌లలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు.

అప్పట్లో కికి ఛాలెంజ్, ఇప్పుడు బాటిల్ క్యాప్ ఛాలెంజ్ వరకు సోషల్ మీడియాలో క్రేజ్ పుట్టించిన కొన్ని ఛాలెంజెస్.

 #KikiChallenge (కికి ఛాలెంజ్)

Kiki Do you love me.. Are you riding.. అనే పాప్ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఈ పాటలోని చిన్న బిట్ తీసుకొని దానికి వారి లాగా స్టెప్ అయిమని సోషల్ మీడియాలో ఛాలెంజ్ చేయడం స్టార్ట్ చేశారు. అది బాగా వైరల్ అయి అదే ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. నిజానికి ఇలాంటి చిన్న కొన్ని సెకన్ల వీడియోలతోనే ఒరిజనల్ వీడియోలకు పాపులారిటీ వస్తుంది. జనాలు వాటి గురించి వెతకడం ప్రారంభిస్తున్నారు. కొందరు అడ్వర్టైజర్లు దీనిని ఒక బిజినెస్ ట్రిక్ లాగా వాడుకొని కూడా రకరకాల ఛాలెంజ్ లతో ముందుకొస్తున్నారు.

https://www.instagram.com/p/Bl7Tw3cHSIq/?utm_source=ig_web_copy_link

#10YearsChallenge (పది సంవత్సరాల ఛాలెంజ్)

కికి ఛాలెంజ్ అయిపోగానే కొంతకాలం వరకు ఈ పది సంవత్సరాల ఛాలెంజ్ మీద పడ్డారు. పది సంవత్సరాలకు ముందు - పది సంవత్సరాల తర్వాత కాలం ఎలా మారింది అని చెప్పటం అన్నమాట. 10 ఏళ్లకు ముందు, వారి ఇప్పటి ఫోటోలు ఇలా సోషల్ మీడియాలో పెట్టుకుంటూ సాగింది ఈ ఛాలెంజ్.

https://www.instagram.com/p/Bsw-B7Hjy4o/?utm_source=ig_web_copy_link

#FuljarsodaChallenge (సోడా తాగే ఛాలెంజ్ )

టిక్ టాక్ లో బాగా ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ ఇది. సోడాని మామూలుగా తాగకుండా డిఫరెంట్ గా ట్రై చేయడం అన్నమాట. ఒక చిన్న షాట్ గ్లాస్ లో ఆకుపచ్చగా ఉండే ద్రావణాన్ని తీసుకొని, దానిని ఇంకో గ్లాస్ లో ఉండే సోడాలో వేస్తే ఆ సోడా బుస్సుమని పొంగుతుంది, దానిని తాగడం అన్నమాట. ఇదో ఛాలెంజ్.

https://www.instagram.com/p/By2jUh7jI3y/?utm_source=ig_web_copy_link

#BottleCapChallenge బాటిల్ మూత తీసే ఛాలెంజ్

అన్ని అయిపోయిన తర్వాత ఇదో కొత్త ఛాలెంజ్ వచ్చింది. బాటిల్ మూతను పడగొట్టే ఛాలెంజ్ ఇది. అంటే బాటిల్ మూత తీయటాన్ని మామూలుగా కాకుండా కొత్తగా ట్రై చేయడం అన్నమాట. ఏదైనా బార్ కు వెళ్తే మందుబాబులు ఇలాంటి అడ్వెంచర్స్ లెక్కలేనన్ని చేస్తారు. అది బార్ లో కాకుండా సోషల్ మీడియాలో చేస్తే మీ టాలెంట్ అనేది పదిమందికి తెలుస్తుంది.

https://twitter.com/akshaykumar/status/1146282714586329090

మీ దగ్గర కూడా ఏదైనా పిచ్చి ఆలోచన ఉంటే వెంటనే దానికి ఏదో ఒక ఛాలెంజ్ పేరుతో, వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేయండి. ఏమో మీ పిచ్చే మిమ్మల్ని క్రేజీ స్టార్ ను చేసేయొచ్చు.