SBI

Newdelhi, Oct 4: నకిలీ పెన్నులు (Fake Pens), నకిలీ వాటర్ బాటిల్స్ ఇలా నకిలీ పేరిట ఏవేవో తయారుచేయడం చూశాం. అయితే, ఛత్తీస్‌ గఢ్‌ లో ఏకంగా ఓ నకిలీ బ్యాంకునే (Fake Banks) సృష్టించారు కేటుగాళ్లు. అవును. ఛత్తీస్‌ గఢ్‌ కు చెందిన కొందరు నేరగాళ్లు ఓ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటుచేసి, ప్రజలను నిండా ముంచారు. నకిలీ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలతో నిరుద్యోగ యువతను సైతం మోసం చేశారు. రాష్ట్ర రాజధాని రాయ్‌ పూర్‌ కు 250 కి.మీ దూరంలోని సక్తి జిల్లా ఛపోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పది రోజుల క్రితం ప్రారంభమైన ఈ బ్రాంచ్‌ లో అచ్చం అసలైన బ్యాంక్‌ లో లాగానే కొత్త ఫర్నీచర్‌, బ్యాంక్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నకిలీ శాఖ అని తెలియక గ్రామస్థులు ఇందులో ఖాతాలు తెరచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నకిలీ శాఖలో ఉద్యోగాలను రూ.2 నుంచి రూ.6 లక్షల ధరకు కొనుక్కున్నట్టు బాధితులు వాపోయారు.

మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)

అలా వెలుగులోకి..

ఎస్బీఐ దబ్రా బ్రాంచ్‌ మేనేజర్‌ కు విషయం తెలిసి, గత నెల 27న ఈ బ్రాంచ్‌ పై విచారణ చేయడంతో అసలు మోసం బయటపడింది. ఈ ఘరానా నేరంలో నలుగురిని నిందితులుగా గుర్తించారు.

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు