Hyderabad, Sep 29: హైదరాబాద్‌లో (Hyderabad) రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) వైపు బారులు తీరారు. దీంతో అబిడ్స్, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, తిలక్ నగర్, ఫీవర్ దవాఖాన వరకు బొజ్జ గణపయ్యలు నిలిచిపోయారు. దీంతో ట్యాంక్ బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ నుంచి వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మర్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిమజ్జనాలు
పాతబస్తీ వైపు నుంచి పెద్ద సంఖ్యలో వినాయకులు తరలి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయానికి మొహంజా మార్కెట్ చౌరస్తాను పోలీసులు క్లియర్ చేశారు. సాధారణ వాహనాలకు అనుమతిస్తున్నారు. అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై నుంచి మరికాసేపట్లో వాహనాలను వదలనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.