Bengaluru, Jan 8: గ్రామస్తులపైకి (Villagers) విరుచుకుపడిన ఓ చిరుతను (Leopard) ఓ వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా దాని తోకను పట్టుకుని చుక్కలు చూపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని రంగపురలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలోని తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని రంగపుర గ్రామంలో ఐదు రోజులుగా చిరుతపులి గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. అయితే, అప్పటికే చిరుతను పట్టుకోవాలని కాచుకుకూర్చున్న గ్రామస్తులు చిరుత పులి కనిపించడంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి వచ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. కానీ, బోను పెట్టి బంధించేందుకు ప్రయత్నించగా చిరుత తప్పించుకోవాలని చూసింది.
Here's Video:
చిరుతపులి తోకను పట్టుకున్న యువకుడు
కర్ణాటక రంగాపూర్‌లో ఘటన
For More Updates Download The App Now - https://t.co/GvJeTp41mk pic.twitter.com/QHTP1sHdG3
— ChotaNews App (@ChotaNewsApp) January 8, 2025
అప్పటికే అలర్ట్ అయ్యి..
అదే సమయంలో గ్రామస్తుల మీదకు విరుచుకుపడింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి చిరుతపులి తోకను పట్టుకుని, అది పారిపోకుండా నిలువరించాడు. అనంతరం అధికారులు వల సాయంతో దాన్ని పట్టి బంధించారు. అనంతరం దాన్ని బోనులో వేసి అక్కడ్నించి తరలించారు. తన సాహసోపేతమైన చర్యతో చిరుతను పట్టుకోవడానికి సహకరించిన అతణ్ని గ్రామస్థులు, అధికారులు అభినందించారు.