Newdelhi, March 26: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ (Rocket) ప్రయోగంలో విజయవంతమైంది. తిరుపతి (Tirupati) జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్-SHAR) నుంచి ఎల్‌వీఎం-3 (LVM-3)వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 24.30 గంటల పాటు కొనసాగింది. ఉదయం 9 గంటలకు వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను తీసుకెళ్లిన ఎల్‌వీఎం-3 వాహక నౌక నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో ప్రయోగం విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఉపగ్రహాల బరువు 5.8 టన్నులుగా శాస్త్రవేత్తలు తెలిపారు.
ISRO successfully launches India's largest rocket LVM3 carrying 36 satellites https://t.co/xZcGF871KO
-via @inshorts
— Ammy (@ammy_lpu) March 26, 2023
#ISRO launches LVM3-M3/Oneweb India-2 Mission from Satish Dhawan Space Centre (SDSC) SHAR, #Sriharikota.#LVM3M3/#Oneweb pic.twitter.com/PAOTJSSl9J
— All India Radio News (@airnewsalerts) March 26, 2023
వన్‌వెబ్‌తో ఒప్పందం
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌వెబ్‌తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా మొదటి 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబరు 23న ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడత 36 ఉపగ్రహాలను సక్సెస్ ఫుల్ గా పంపింది.