JDU MLA Gopal Mandal: ఆపుకోలేక.. కట్ డ్రాయర్‌తో పరుగులు పెట్టిన ఎమ్మెల్యే, ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు, ఘటనపై వివరణ ఇచ్చిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్
JDU MLA Gopal Mandal

New Delhi, Sep 4: బీహార్ రాష్ట్రంలో అధికార జేడీయూ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గోపాల్ మండల్ (Narendra Kumar Neeraj alias Gopal Mandal) తాజాగా వార్తల్లోకెక్కారు. రైలులో లోదుస్తులతో ప్రయాణించడంపై తోటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఆయన (JDU MLA Gopal Mandal ) దీనికి బదులిచ్చారు. రైలు ఎక్కగానే వాష్‌రూంకి హడావుడిగా వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే తన కుర్తా, పైజామాని తీసేసినట్లు తెలిపారు. టవల్‌ను చుట్టుకునేందుకు బదులుగా తొందరలో భుజంపై వేసుకున్నట్లు చెప్పారు.

రైలు ప్రయాణంలో కడుపులో ఇబ్బంది ఉండటం వల్లే తాను లోదుస్తుల్లోనే అటు ఇటు తిరిగినట్లు వెల్లడించారు. ఆ సమయంలో బోగీలో మహిళలు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. అయితే, తాను వాష్ రూంకి వెళ్లి బయటికి వచ్చిన తర్వాత తనతో ఓ వ్యక్తి గొడవపెట్టుకున్నాడని తెలిపారు. పోలీసులు వచ్చి మాట్లాడుతుండగా తనను నెట్టేశాడన్నారు. అయితే, తానే అతనికి క్షమాపణలు చెప్పినట్లు ఎమ్మెల్యే గోపాల్ మండల్ తెలిపారు

చిన్నారులను చంపేస్తున్న హెమరాజిక్‌ డెంగీ, యూపీలో 40 మంది చిన్నారులు మృతి, 50కు చేరిన మరణాల సంఖ్య, అప్రమత్తమైన యోగీ సర్కారు

ఎమ్మెల్యే గోపాల్ మండల వ్యవహారంపై బీహార్ ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. జేడీయూ బ్రాండ్ అంబాసిడర్, నితీశ్ కుమార్ ప్రియమైన ఎమ్మెల్యే లోదుస్తులతోనే మహిళల ముందు నడిచారని ఎద్దేవా చేస్తూ ఆర్జేడీ నేతలు పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలే బీహార్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని ఎల్జేపీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. ఇలాంటి ప్రజాప్రతినిధులకు ప్రజలతో ఎలా వ్యవహరించాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రత్యేకంగా ట్యూషన్ చెప్పించాలని వ్యాఖ్యానించారు.

Here's JDU MLA Video

కాగా తేజాస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో జేడీయూ ఎమ్మెల్యే వాష్‌రూంకు అర్జెంటుగా వెళుతూ కూర్చున్న చోటే కుర్తా, పైజామా విప్పదీశాడు. టవల్‌ తీసుకొని దాన్ని నడుము కొట్టుకొంటే సమయం మించిపోతుందని భయపడి.. భుజానేసుకొని కట్‌ డ్రాయర్‌ మీద అలానే పరుగు తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.