Representative Image

Student Gives Birth In College Toilet: కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో చదువుతున్న 17 ఏళ్ల యువతి సోమవారం క్యాంపస్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. 11వ తరగతి చదువుతున్న బాలిక మహిళా టాయిలెట్‌లో తన బిడ్డను ప్రసవించిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.బాలికను, పాపను ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు కోలార్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేసును టేకప్ చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.  గర్భవతి అని తెలియదట.., కడుపు నొప్పి అంటూ బాత్రూంకి వెళ్లి బిడ్డను ప్రసవించిన విద్యార్థిని, యూకేలో షాకింగ్ ఘటన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్మాయి, అబ్బాయి గత రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. విద్యార్థిని గర్భవతి అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఎలా [గర్భధారణ] గమనించలేకపోయారు, ఆమె సమాచారాన్ని ఎందుకు దాచిపెట్టింది అనేది ఇప్పటికీ మిస్టరీగా ఉంది. బిడ్డను ప్రసవించిన తర్వాత బాలిక కోలుకుంటున్నందున, మహిళా కౌన్సెలర్ సహాయంతో, మేము ఆమెతో తరువాత మాట్లాడుతాము, ”అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ 6 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 376 (2)(ఎన్) (ఒకే మహిళపై పదే పదే అత్యాచారానికి పాల్పడడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొత్త క్రిమినల్ చట్టాలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ కేసు నమోదైనప్పటికీ, ఆరోపించిన నేరం తొమ్మిది నెలల క్రితం జరిగిందని, ఈ కేసులో కొత్త చట్టాలు వర్తించవని పోలీసు అధికారి తెలిపారు.