Soil On Railway Track (Credits: X)

Newdelhi, Oct 7: రైళ్లను (Trains) పట్టాలు తప్పించేందుకు దుండగులు పన్నుతున్న దుశ్చర్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రైల్వే ట్రాక్‌ లపై (Railway Track) గ్యాస్‌ సిలిండర్లు, ఇనుప కడ్డీలు ఉంచూతూ రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు పన్నుతున్న దుండగులు.. ఇప్పుడు ఏకంగా మట్టి కుప్పలే పోశారు. ఉత్తరప్రదేశ్‌ లోని రాయ్‌ బరేలీ జిల్లాలో ఖీరూన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రఘు రాజ్‌ సింగ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, రైలు పట్టాలపై ఉన్న ఇసుక కుప్పను చూసిన లోకో పైలట్‌.. రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌ పై నుంచి దానిని తొలగించిన తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ మరో ప్రసాదంపై వివాదం.. శబరిమల అయ్యప్ప ప్రసాదంలో కల్తీ.. మోతాదుకు మించి క్రిమి సంహారకాలు

Here's Video:

అలా పెను ప్రమాదం తప్పింది

డంపర్‌ నుంచి రైల్వే ట్రాక్‌ పై ఇసుక పోశారని అధికారులు తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత రాయ్‌ బరేలీ-రఘురాజ్‌ సింగ్‌ స్టేషన్‌ మధ్య నడుస్తున్న రైలు అటుగా వచ్చిందని వెల్లడించారు. అయితే లోకోపైలట్‌ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు.

వీడియో ఇదిగో, నెల రోజులుగా సర్వీసింగ్ చేయడం లేదని ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టిన కస్టమర్లు, కర్ణాటకలో ఘటన