Hyderabad, Dec 11: గూగుల్ (Google) పై అతివిశ్వాసం ఓ డ్రైవర్ (Driver) ను నట్టేట ముంచింది. రాత్రి వేళ గూగుల్ మ్యాప్స్ (Google Maps) రూట్ లో డీసీఎం (DCM) తోలడంతో చివరకు అది గౌరవెల్లి రిజర్వాయర్ (Gouravell Reservoir) లో దిగింది. జరగబోయే ప్రమాదాన్ని డ్రైవర్ చివరి నిమిషంలో గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. డీసీఎంలోని డ్రైవర్, సిబ్బందిని స్థానికులు కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ నుంచి మిల్క్ ప్యాకెట్ల లోడుతో ఓ డీసీఎం హుస్నాబాద్ కు బయలుదేరింది. అక్కడ డెలివరీ పూర్తి చేశాక రాత్రి 10 గంటలకు చేర్యాల మీదుగా హైదరాబాద్ వైపు బయలుదేరింది. గూగుల్ మ్యాప్స్ చూపించిన రూట్లో డ్రైవర్ వాహనం నడిపాడు.
నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్.! గౌరవెల్లి ప్రాజెక్టులో చిక్కుకున్న లారీ | Google Map | Siddipet | hmtv#hmtvnews #hmtv pic.twitter.com/gNtekwCKz1
— hmtv News (@hmtvnewslive) December 11, 2023
అయితే, నందారం స్టేజీ వద్ద కుడివైపు మలుపు చూపించాల్సిన మ్యాప్స్ ఎడమవైపు చూపించడంతో డీసీఎం నేరుగా గౌరవెల్లి రిజర్వాయర్ నీటిలోకి వెళ్లిపోయింది. గూగుల్ మ్యాప్ నే నమ్మిన డ్రైవర్ రోడ్డుపై వాన నీరు నిలిచి ఉందని భావించి రిజర్వాయ్‌లోకి వాహనాన్ని తోలాడు. అయితే, అంతకంతకూ లారీ నీళ్లల్లోకి దిగబడిపోతుండటంతో తప్పుడు రూట్లో ప్రయాణిస్తున్నామని డ్రైవర్ గ్రహించి వాహనాన్ని నిలిపివేశారు. అనంతరం, లారీ డ్రైవర్, ఇతర సిబ్బంది ఆర్తనాదాలు చేయగా దాదాపు రెండు గంటల తరువాత స్థానికులు వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. మర్నాడు ఉదయం డీసీఎంను బయటకు తీశారు.
TS Govt: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, ఏకంగా 54 మంది నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు