Imphal, Sep 29: మణిపూర్ రాజధాని ఇంపాల్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు మల ద్వారంలో (Man Hides Gold Paste In Rectum) దాదాపు 900 గ్రాముల బరువు మరియు సుమారు ₹ 42 లక్షల విలువ చేసే బంగారు పేస్ట్ తో పోలీసులకు చిక్కాడు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఇంఫాల్ విమానాశ్రయంలో (Imphal International Airport) ప్రయాణికుడి నుండి గోల్డ్ మెటల్ స్వాధీనం చేసుకుంది. మొత్తం నాలుగు గోల్డ్ పేస్ట్ ప్యాకెట్లు ఉన్నాయని, వాటి బరువు 90.68 గ్రాములు ఉంటుందని సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ బీ దిల్లి తెలిపారు.
ఎయిర్పోర్ట్లో ఫ్రిస్కింగ్ చేస్తున్న సమయంలో మలాశయం వద్ద మెటల్ ఉన్నట్లు గుర్తించామని, మొహమ్మద్ షరీఫ్ అనే ప్యాసింజెర్ను ఈ కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. కేరళలోని కోచికోడ్కు చెందిన అతను ఇంపాల్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. తనిఖీ సమయంలో వేసిన ప్రశ్నలకు అతను సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో మెడికల్ ఎగ్జామినేషన్ రూమ్లో అతనికి ఎక్స్ రే తీశారు.
Here's Man Hides Gold Paste In Rectum
@CISFHQrs has caught gold worth 42 lakhs which was brought hiding inside rectum. Mohammad Sharif was coming from Imphal to Delhi in @airindiain, during security check CISF got suspicious about Sharif's decency. X-rays showed that 909.68 grams of gold was hidden in the rectum. pic.twitter.com/ke3WlOVmQW
— 7Annihilator🇮🇳 (@7Annihilator) September 28, 2021
ఎక్స్ రే రిపోర్ట్ ప్రకారం అతని శరీర మలాశయ భాగంలో లోహం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్యాసింజెర్ గోల్డ్ పేస్ట్ ఉన్నట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై CISF..కస్టమ్స్ సీనియర్ అధికారులకు సమాచారం అందించబడింది. తదుపరి చర్య కోసం ప్రయాణీకుడిని వారికి అప్పగించారు.