Newdelhi, July 21: ఆమె ఓ వీరనారి. పట్టుమని పాతికేండ్ల వయసులోనే గొడ్డలితో (Axe) పులిని చంపిన ఆమె.. క్యాన్సర్ భూతం ముందు ఓడిపోయింది. అవును.. జెడింగీ (72) (Zadingi) మరణించారు. సుదీర్ఘకాలంపాటు క్యాన్సర్ తో పోరాడిన ఆమె శుక్రవారం కన్నుమూశారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని లుంగ్ లేయీ జిల్లా బవార్ పుయీ గ్రామానికి చెందిన ఆమె 3 జులై 1978లో ఇరవై ఆరేళ్ల వయసులో వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లారు. అప్పటికే అక్కడ పొంచివున్న పులి జెడింగీపై దాడిచేసింది. ఆమె ఏమాత్రం భయపడకుండా తన చేతిలో ఉన్న చిన్న గొడ్డలితో దానితో పోరాడింది. చివరికి దానిని నరికి చంపింది. జెడింగీకి మిజోరం ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి లాల్ దుహోమా సంతాపం తెలిపారు.
Zadingi, a woman who became a household name in #Mizoram after killing a tiger in self-defence in 1978, died on July 19 after battling cancer for several months.https://t.co/DrnhhRYVa7
— The Hindu (@the_hindu) July 20, 2024
గొప్ప సత్కారం
జెడింగీ ధైర్య సాహసాలకు మెచ్చిన ప్రభుత్వం 1980లో ‘శౌర్యచక్ర’ అవార్డుతో గౌరవించింది. ఆమె చంపిన పులి కళేబరాన్ని మమ్మీగా మార్చి మిజోరం రాష్ట్ర మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. అది ఇప్పటికీ ఉంది. జెడింగీ సాహసగాథను రాష్ట్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి.. ఎలా జరిగిందంటే??