జూన్‌లో వెస్టిండ్, అమెరికా వేదికగా ఐసీసీ 20 ప్రంపచకప్-2024 అట్టహాసంగా ముగిసిన సంగతి విదితమే. భారత్ విశ్వవిజేతా నిలిచింది. ఈ మెగా టోర్నీలో తొలిసారిగా 20 జట్లు పాల్గొనగా రోహిత్ శర్మ, మార్క్రామ్ నేతృత్వంలోని భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు చేరాయి. . బార్బడోస్ వేదికగా చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత రెండోసారి వరల్డ్ కప్‌ను గెలించింది.
తాజాగా ఐసీసీ 2026 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ తరహాలోనే టోర్నీ జరుగనున్నది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ 2026 వరకు టీమిండియా T20I షెడ్యూల్ ఇదిగో, మొత్తం 37 మ్యాచ్‌లు ఆడనున్న భారత్
వచ్చే వరల్డ్ కప్‌కు మొత్తం 12 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య హోదాలో రెండు జట్లు భారత్, శ్రీలంక అర్హత సాధించాయి. ఐసీసీ ప్రస్తుత ర్యాంకుల ఆధారంగా మరో మూడుజట్లు న్యూజిలాండ్, ఐర్లాండ్, పాకిస్థాన్‌లు చోటు సంపాదించాయి. త టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ఏడు జట్లకు అర్హత లభించనున్నది. వాటిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, USA, వెస్టిండీస్ ఉన్నాయి. మరో ఎనిమిది జట్లకు క్వాలిఫైయింగ్ టోర్నీ నిర్వహించనున్నారు.
ఇక ప్రస్తుత టోర్నీలో మాదిరిగా 20 జట్లు నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఆ తర్వాత గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ 8కు చేరుతాయి. సూపర్ 8లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్‌లోకి ఎంట్రీ ఇస్తాయి. సెమీఫైనల్‌లో గెలుపొందిన జట్లు ఫైనల్‌లో ఆడుతాయని ఐసీసీ వివరించింది.