jaipur, April 27: కరోనావైరస్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు విచిత్ర వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవగా తాజాగా వారి సరసన బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Union Minister Gajendra Singh Shekhawat) కూడా చేరారు. కరోనాతో కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధితులకు ధైర్య చెప్పే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
లార్డ్ బాలాజీకి కొబ్బరి కాయ కొట్టండి అంతా ఆయనే చూసుకుంటారని (Pray to Balaji, offer coconut) షెకావత్ చెప్పడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి కారణంగానే కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విజృంభిస్తోందని విమర్శిస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక లక్షలాది మంది జనం ప్రాణాలు కోల్పోతుంటే ఉచిత సలహాలు ఏంటని ఆయన వ్యాఖ్యలపై చురకలు వేస్తున్నారు.
రాజస్తాన్ జోధ్‌పూర్‌లో కేంద్రమంత్రి షెకావత్ సోమవారం పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధురాదాస్ మాథుర్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన్ను ఓ యువకుడు కలుసుకుని తన తల్లిని కాపాడాలని ప్రాధేయపడ్డాడు. యువకుని విజ్ఞప్తి మేరకు షెకావత్ డాక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. కేంద్రమంత్రి ఆదేశాలతో బాధితురాలికి చికిత్స చేసేందుకు డాక‍్టర్లు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ బాధితురాలు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో.. మృతురాలి కుమారుడు గుండెలవిసేలా రోదించాడు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకున్న తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని కొడుకు రోధించిన తీరు చూపురులను కంటతడి పెట్టించింది.
एक परेशान माताजी को दवा और दुआ दोनों पर भरोसा दिलाना मेरे कर्तव्य के दायरे में आता है और वही मैंने निभाया।
मुझे वहां दिन - रात ड्यूटी कर रहे डॉक्टरों द्वारा किए जा रहे इलाज पर कोई संदेह नहीं है। निश्चित रूप से वे अपनी जिम्मेदारी पूरी तरह निभा रहे हैं।
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) April 26, 2021
भगवान बालाजी पर आस्था रखने की बात कहना, बुराई है क्या?
राजस्थान ही नहीं देश और दुनिया में करोड़ों लोग बालाजी महाराज के भक्त हैं, अगर मैंने कह दिया कि नारियल चढ़ा दीजिएगा, तो क्या इससे मैं निष्क्रिय और लापरवाह साबित होता हूं?
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) April 26, 2021
मैंने सभी मुख्य अस्पतालों का अवलोकन किया, जरूरी दिशा - निर्देश दिए और हर संभव सहायता के लिए स्वयं को उपलब्ध बताया।
लेकिन मेरी संवेदना का मजाक बनाकर खबर तैयार कर रहे पत्रकार मित्रों को केवल बालाजी महाराज का सुमिरन ही ख़बर के लायक लगा। अफ़सोस!
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) April 26, 2021
అయితే, మృతురాలి బంధువులను ఓదార్చే క్రమంలో షెకావత్.. ‘బాలాజీ మహరాజ్ మంత్రాన్ని జపించి కొబ్బరికాయ కొట్టండి (You offer coconut to Balaji, everything will be alright). అంతా ఆయనే చూసుకుంటారు’ అని షెకావత్ వ్యాఖ్యానించాడు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడ్డారు. సరైన సదుపాయాలు కల్పించకుండా దేవుడిని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షెకావత్ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దేవుడిపై నమ్మకంతో కొబ్బరికాయ కొట్టమని చెప్పాను అందులో తప్పేముంది. ఆందోళనలో మృతురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలనుకున్నాను. నేను అదే చేశాను’ అని ఆయన పేర్కొన్నారు.
గతేడాది కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు మద్దతుగా అనేక కార్యక్రమాలు జరిగాయి. ఆ సమయంలో కరోనా నివారణ, అవగాహన కోసం కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ‘గో కరోనా గో కరోనా’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఆ స్లోగన్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది.