Credits: Twitter

Newdelhi, Jan 29: వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో క్లీనింగ్ (Cleaning in Train) పద్ధతిని మార్చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి (Central Railway Minister) అశ్విని వైష్ణవ్ ఆదివారం ట్వీట్ చేశారు. రైలు బోగీ మొత్తం చెత్తచెత్తగా మారిన ఫొటోలు శనివారం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా (Viral) మారిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర మంత్రి స్పందించారు. వందే భారత్ రైలును పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్త తొలగించే పద్ధతిని మార్చేశామని, ఈ కొత్త పద్ధతికి ప్రజల సహకారం కావాలని కోరారు. మెయింటనెన్స్ సిబ్బంది ఒకరు చెత్త బుట్టతో ప్రయాణికుల సీటు వద్దకే వచ్చి వాటర్ బాటిల్స్, టీ కప్పులు, ఆహార పదార్థాల కవర్లు.. తదితరాలను తీసుకెళతాడని మంత్రి వివరించారు. ప్రస్తుతం విమానాలలో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారని, ఇకపై వందే భారత్ లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తామని మంత్రి చెప్పారు.

జీన్స్ ధరించి కోర్టుకొచ్చిన సీనియర్ న్యాయవాది.. బయటకు పంపిన న్యాయమూర్తి

ఆహార పదార్థాలు తినేశాక మిగిలిన వాటిని బోగీలోనే పడేయకుండా పక్కన పెట్టి, మెయింటనెన్స్ సిబ్బంది వచ్చాక ఆ చెత్త బుట్టలో పడేయాలని అశ్విని వైష్ణవ్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త పద్ధతి అమలు చేస్తే ఎలా ఉండబోతోందో చెబుతూ కేంద్ర మంత్రి ఓ వీడియోను ట్వీట్ చేశారు.

కొవిడ్ లాక్ డౌన్ లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రల వినియోగం పైపైకి..