రిలయన్స్ జియో పేరిట సందేశాలు పంపుతూ కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు హ్యాకర్లు మొదలుపెట్టారు. దీనిపై రిలయన్స్ తమ కస్టమర్లను వెంటనే అలర్ట్ చేసింది. సున్నితమైన సమాచారం అందించాలంటూ జియో పేరుతో వచ్చే సందేశాలను నమ్మొద్దంటూ వినియోగదారులకు తెలిపింది. ఈ మేరకు కొన్ని సూచనలు జారీ చేసింది.
కాల్, మెసేజ్, వాట్సప్, ఇ- మెయిల్.. ఇలా ఏ మార్గంలోనైనా సైబర్ నేరగాళ్లు మీకు సందేశాలు పంపొచ్చు. పాన్‌కార్డ్ నంబర్, ఆధార్ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపీలు.. ఇలాంటి సున్నితమైన సమాచారం అడుగుతారు. జియో పేరిట ఇలా వ్యక్తిగత వివరాలు అడిగితే ఎటువంటి లింక్‌లపై క్లిక్ చేయొద్దు. ఎస్సెమ్మెస్‌లకు సమాధానం ఇవ్వొద్దని తెలిపింది. కాగ్నిజెంట్ నూతన చైర్మన్‌గా రాజేశ్ వారియర్, నాస్కాం ప్రెసిడెంట్‌గా నియమితులు కావడంతో రాజీనామా చేసిన రాజేశ్ నంబియర్
సిమ్ కార్డ్ వెనక ఉండే 20 డిజిట్స్ నంబర్‌ను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ అకౌంట్ పాస్‌వర్డ్‌లు, యాప్ పిన్‌లు మార్చడం ఉత్తమం. మీ డివైజ్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని కోరింది. జియో సంస్థ ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నలు అడగదని స్పష్టం చేసింది. మీకు ఈ అంశంపై ఎటువంటి సందేహాలు ఉన్నా ‘‘మై జియో’’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది.