Patna, July 07: ఒక పాముని చూస్తేనే ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. కాళ్లు చేతులు వణుకుతాయి. వెన్నులో వణుకు పడుతుంది. అలాంటిది పదుల సంఖ్యలో పాములు కనిపిస్తే.. వామ్మో ఇంకేమైనా ఉందా? పై ప్రాణాలు పైనే పోతాయి కదూ. బీహార్ లోని రోహ్తాస్ లో ఒక ఇంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో ఏకంగా 60 పాములు (Snakes) కనిపించడం తీవ్ర కలకలం రేపింది. సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్రద్ కుర్ద్ గ్రామంలో ఓ పురాతనమైన ఇల్లు ఉంది. సుమారు 70ఏళ్ల క్రితం నాటి ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో నుంచి కొన్ని పాములు బయటకు రావడాన్ని గుర్తించాడు ఇంటి యజమాని కృపా నారాయణ్ పాండే (Narayana pande). వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచి కొన్నింటిని కొట్టి చంపేశాడు. అయినా ఇంకా పాములు బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో కంగారుపడ్డ ఇంటి యజమాని వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు సిబ్బందితో రంగంలోకి దిగారు. పాములన్నింటిని పట్టుకున్నారు. వాటిని ఊరికి దూరంగా అడవిలో వదులుతామన్నారు.
बिहार के रोहतास में जब घर से निकलने लगे सांप तो लोग गिनती करते रह गए, रेस्क्यू टीम के भी उड़े होशे, VIDEO !
एक-एक कर इतने सांप मिले कि लोग गिनते रह गए !
सूर्यपुरा थाना क्षेत्र के अगरेड़ खुर्द गांव का है !@abpbihar @ABPNews @kumarprakash4u @NitishKumar pic.twitter.com/paLu9KnJiD
— RANJAN SINGH RAJPUT ( रंजन सिंह राजपूत ) (@Ranjanabpnews) July 7, 2023
అధికారులు పాములను పట్టుకుని ఓ పెద్ద డబ్బాలో వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ్మో.. ఇన్ని పాములా? అని నెటిజన్లు నివ్వెరపోతున్నారు. అది ఇల్లా? పాముల పుట్టా? అని నోరెళ్లబెడుతున్నారు. కాగా, అవన్నీ విషపూరితమైనవే అని తెలియడంతో ఇంటి యజమాని సహా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ”సుమారు 30 పాములను పట్టుకున్నాం. సర్పాలు ఇంటి గోడలో తలదాచుకున్నాయి. గోడను పగులకొట్టి పాములను బయటకుతీశాము. వాటిని అటవీ ప్రాంతంలో వదిలేశాము” అని అటవీశాఖ అధికారి తెలిపారు.
”మా ఇల్లు 1955లో నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాము. ఇది రెండంతస్తుల భవనం. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటన జరిగింది లేదు. ఇంతవరకు పాములు కనిపించలేదు. కానీ, ఏకంగా 60 సర్పాలు బయటపడటం ఇదే తొలిసారి” అని ఇంటి యజమాని చెప్పారు. ఈ ఘటనతో ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు.