New Delhi, Mar 7: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో (Shraddha Walkar Murder Case) శ్రద్ధా వాకర్ హత్య కేసులో షాకింగ్ నిజాలు, అఫ్తాబ్ శిక్షణ పొందిన చెఫ్ (Aftab is trained chef), అందుకే అలా ముక్కలుగా నరికాడని కోర్టుకు తెలిపిన ఢిల్లీ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా శిక్షణ పొందిన చెఫ్ అని అతనికి మాంసాన్ని ఎలా నిల్వ చేయాలో బాగా తెలుసని ఢిల్లీ పోలీసులు (Delhi Police) మంగళవారం కోర్టుకు తెలిపారు.అఫ్తాబ్ తాజ్ హోటల్ చెఫ్‌గా ట్రైనింగ్ తీసుకున్నాడు. అతడికి మాంసం పాడవకుండా నిల్వ చేయడం తెలుసు. అంతేకాదు శ్రద్ధాను హత్య చేసిన అనంతరం అతను డ్రై ఐస్, అగర్‌బత్తీలను కూడా ఆర్డర్ చేశాడని కోర్టుకు తెలిపారు.
శ్రద్ధను చంపిన తర్వాత మరొక అమ్మాయితో లవ్ ట్రాక్ నడిపాడని, ఆమెకు ఉంగరం కూడా ఇచ్చాడని ఢిల్లీలోని సాకెట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో ఢిల్లీ పోలీసులు తెలిపారు. శ్రద్ధా హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు వెల్లడించామని ఢిల్లీ పోలీసుల తరపున వాదిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు మార్చి 20వ తేదీకి వాయిదా వేసింది.ఆ రోజుకు ముందే తమ వాదనలను దాఖలు చేయాలని అఫ్తాబ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్‌ను ఆడిషనల్ సెషన్స్ జడ్జి మనీశ్ ఖురాన కక్కర్ ను న్యాయస్థానం ఆదేశించింది.
కాగా 2022 మే నెలలో తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధాను అఫ్తాబ్ దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృత దేహాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. అనంతరం ఆన్‌లైన్‌లో రంపం ఆర్డర్ చేసి దాంతో శ్రద్ధ శరీరాన్ని 35 భాగాలుగా కట్ చేసి ఆ ముక్కలను అటవీ ప్రాంతంలో వివిధ ప్రదేశాల్లో పడేశాడు.
శ్రద్ద బతికే ఉన్నట్టు అందరినీ నమ్మించేందుకు ఆమె సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తూ, క్రెడిట్ కార్డు బిల్లులు కూడా కట్టాడు. అయితే నిజం బయటపడటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 2022 నవంబర్ నుంచి అఫ్తాబ్ పోలీస్ కస్టడీలో ఉంటున్నాడు. జనవరి 24న ఢిల్లీ పోలీసులు 6,629 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తున్నట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.