Tax Benefits(X)

Hyd, July 24:  వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇక మోడీ కేబినెట్‌లో మూడోసారి చోటు దక్కించుకుని అరుదైన ఘనతను నిర్మలా సొంతం చేసుకున్నారు. ఇక బడ్జెట్ అనగానే అందరి కళ్లు ఉండేది ఐటీ రిటర్న్స్ అదే ట్యాక్స్ విధానంపైనే. ఎప్పుడెప్పుడు ట్యాక్స్‌పై కేంద్రమంత్రి ప్రకటన చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు.

అయితే ఈ ఏడాది పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి నిర్మలా. దీంతో ఇప్పటివరకు పన్ను చెల్లిస్తున్న వారికి కొత్తగా తీసుకొచ్చిన ఐటీ ట్యాక్స్ విధానం అర్థం కాక గందరగోళం నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఐటీ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం సేవింగ్స్, హోమ్‌లోన్స్,ఎల్‌ఐసీ తదితర మినహాయింపులు కావాల్సిన వారికి పాత పన్ను విధానమే బెటర్ అని సూచిస్తున్నారు. ఇక ఇన్‌కం 15 లక్షల రూపాయలపై ఉన్న వారికి ఏ పన్ను విధానమైనా ఒక్కటేనని సీనియర్‌ సిటిజన్స్‌కు కొత్త పన్ను విధానం బెటర్ అని చెబుతున్నారు.

పాత పన్ను విధానం ప్రకారం సేవింగ్స్, హోమ్‌లోన్స్ ఉంటే ఇదే బెస్ట్. ఇక 60 సంవత్సరాలోపు వారికి పాత పన్ను విధానమే బెటర్ ఆప్షన్. అలాగే వేతన జీవులకు మినహాయింపులు క్లైయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక కొత్త పన్ను విధానం సీనియర్ సిటిజన్స్‌కు ఇది ఎంతో ప్రయోజనకరం. అలాగే వ్యాపారస్తులకు ఇది బెటర్ ఆప్షన్ కాగా పరిమితమైన మినహాయింపులకు ఛాన్స్ ఉంటుంది. పొదుపు, రుణాలు లేకుంటే కొత్తగా తీసుకువచ్చిన పన్ను విధానమే బెటర్. ఇష్టమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ ఉండటమే కాదు ఈ పన్ను విధానాన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రూ.3 లక్షల వరకూ జీరో ట్యాక్స్‌, ఆదాయం రూ.3 లక్షల దాటితే 5 శాతం పన్ను, కొత్త విధానంలో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు ఇలా..