Telangana’s Mohammed Rafi trains recruits on the tunes of ‘Dhal Gaya Din video goes viral (Photo- IPS Association Twitter)

Hyderabad. June 17: పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం తీసుకునే ట్రైనింగ్‌ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజులో 18 గంటల పాటు వివిధ రకాల ట్రైనింగ్‌ సెషన్స్‌ నడిపిస్తారు. అలాంటి ట్రైనింగ్ ద్వారా రాటుదేలితేనే పోలీసులు డ్యూటీలో సమర్థవంతంగా పనిచేస్తారు. ఇదంతా ఎందుకంటారా.. తాజాగా తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో (Telangana State Special Protection Force) ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (Assistant Sub-Inspector of police) వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ పల్లెలన్నీ బాగుపడాలి! గ్రామాలు, పట్టణాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్లేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్య, తెలంగాణ గ్రామీణాభివృద్ధిపై అధికారులకు సమగ్రమైన మార్గదర్శకాలు జారీ

కింద వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహ్మద్‌ రఫీ (Mohammed Rafi). తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో అసిస్టెంట్‌ సబ్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కొత్తగా ట్రైనింగ్‌ తీసుకుంటున్న పోలీసులకు మహ్మద్‌ రఫీ తనదైన శైలిలో పాఠాలు చెప్తూ..అందరి దృష్టి తనవైపుకు తిప్పుకునేలా చేస్తున్నారు. మైదానంలో ఫిజికల్‌ ట్రైనింగ్‌ సెషన్‌లో బాలీవుడ్‌ లెజెండ్‌ సింగర్‌ మహ్మద్‌ రఫీ పాడిన 'దల్‌ గయా దిన్‌.. హో గయి శామ్‌ (Dhal Gaya Din) పాడుతూ అందరితో కవాతు చేయించారు. 1970లో వచ్చి హంజోలి చిత్రంలోని ఈ పాటను మహ్మద్‌ రఫీ పాడారు. డ్రిల్‌ శిక్షకుడి పనితీరుకు హాట్సాఫ్‌.. అంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు.

Here's IPS Association Tweet

ట్రైనింగ్‌ ట్యూన్స్‌ బై రఫీ అనే క్యాప్షన్‌తో ఐపీఎస్‌ అసోసియేషన్‌ (IPS Association) ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇవి శిక్షణకు సంబంధించి మా రఫీ (ASI Md Rafi) చేస్తున్న పాటలు.. ఒకరేమో పోలీస్‌.. మరొకరేమో లెజండరీ సింగర్‌..ఇద్దరు పేర్లు కామన్‌గా ఉన్నా.. మా రఫీ కూడా పాటలు బాగా పాడుతాడు. ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తూనే వారికి ఇంటి బెంగను, శారీరక శ్రమను మరిచిపోయేలా చేస్తాడు.. నిజంగా ఇది అతనికున్న గొప్ప అభిరుచి' అంటూ క్యాప్షన్‌ జత చేశారు.

కాగా శిక్షణ తీసుకుంటున్న పోలీసులకు ఉపశమనం కోసం దేశభక్తితో కూడిన పాటలు పాడుతూ సెషన్‌ నిర్వహిస్తున్నట్లు ఏఎస్‌ఐ మహ్మద్‌ రఫీ చెప్పారు. 2007 నుంచి నేను ఇలా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నా. ప్రతీ రోజు ఉదయం 4.30 నుంచి రాత్రి 8 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. లెజెండరీ సింగర్‌ పేరు పెట్టుకున్న రఫీ మొత్తానికి ఆయన పాటతో అందరిలో జోష్‌ నింపుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.