
Hyd, Aug 27: టెలిగ్రామ్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న సోషల్ మీడియా యాప్. అయితే ఇప్పుడు ఈ యాప్ పారదర్శకతపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే నేరపూరిత కార్యక్రలాపాలు, గ్యాంబ్లింగ్, డ్రగ్స్ సరఫరాకు అడ్డగా మారిందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, దర్యాప్తు ఫలితాలను బట్టి మెసేజింగ్ యాప్‌ను నిషేధించవచ్చని కేంద్ర వర్గాల సమాచారం.
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు ఆఫీసర్ పావెల్ దురోవ్‌ను ఆగస్టు 24 న ప్యారిస్‌లో యాప్ మోడరేషన్ విధానాలపై అరెస్టు చేయడంతో ఈ విషయం బయటపడింది. టెలిగ్రామ్ యాప్ లో నేర కార్యకలాపాలను నిరోధించడంలో విఫలమైనందుకు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి.
భారతదేశంలో 5 మిలియన్లకు పైగా టెలిగ్రామ్ యూజర్లు ఉన్నారు. ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ సహా కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగించే స్కామ్‌లు సహా నేరపూరిత కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. దీంతో కేంద్ర హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ఈ యాప్‌పై విచారణ జరుగుతోంది. ఉబర్‌కు భారీ షాకిచ్చిన నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం, పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులో 32.4 కోట్ల డాలర్ల జరిమానా
ఐపీసీ సెక్షన్ 14C ప్రకారం దర్యాప్తు సాగుతోండగా గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్‌లో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా పోర్న్ వీడియోల అప్‌లోడింగ్, షేరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.అలాగే పైరసీ మూవీలకూ టెలిగ్రామే అడ్డాగా మారింది.
ఇక దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన యుజీసీ - నీట్ వివాదంపై కూడా టెలిగ్రామ్ వార్తల్లో నిలవడంతో కేంద్ర దర్యాప్తు ముమ్మరం చేసింది. టెలిగ్రామ్ యాప్ పారదర్శకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో కేంద్రం చేసే విచారణలో నిజమని తేలితే భారత్‌లో బ్యాన్ కావడం పక్కా అని తెలుస్తోంది.