Pink Power Run (Credits: X)

Hyderabad, Sep 29: ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ (Breast cancer) కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముందస్తుగా ఈ కేసులను గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోవడంతో మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పింక్‌ పవర్‌ రన్‌ 2024 పేరిట (Pink Power Run) ఓ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి దీన్ని  ప్రారంభించారు. సుధారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ మారథాన్‌ ఆర్భాటంగా సాగింది. ఒకేసారి 3కే, 5కే, 10కే రన్‌ ను నిర్వహించారు. పింక్‌ మారథాన్‌ లో గెలిచినవారికి సీఎం రేవంత్‌ రెడ్డి మెడల్స్‌ పంపిణీ చేయనున్నారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పై హెచ్ ఆర్సీలో కేసు.. 'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కేసు

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో స్థానం కోసం

ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో స్థానం సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

రిపోర్టర్‌ ను చెట్టుకు కట్టేసిన ప్రజలు.. ఎందుకంటే? (వీడియోతో)