Newdelhi, Sep 15: ఈ వార్తా చదివాక.. మీరు ఒకింత షాక్ కి గురవుతారు. అంగట్లో ఆడదాన్ని అమ్మే విష సంస్కృతి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని శివపురిలో జరుగుతున్నది. అవును. అక్కడ మహిళల సంత జరుగుతున్నది. ‘ధడీచా’ పేరుతో కొనసాగుతున్న ఈ ఆచారం సర్వత్రా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఈ సంతలో భర్తలు తమ భార్యలను, (Wife for Rent) ఇంట్లో ఉన్న యువతులు, మహిళలను అద్దెకు ఇస్తారు. నచ్చిన యువతిని ఒకరోజు నుంచి నెలలు, సంవత్సరాల కోసం అద్దెకు తీసుకోవచ్చు. ఈ మేరకు ఆమె కుటుంబ సభ్యులు, అద్దెకు తీసుకునేవారు స్టాంపు పేపర్లపై ఒప్పందం రాసుకుంటారు. అద్దె రూ.15,000 నుంచి లక్షల రూపాయల వరకు ఉండవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
అద్దెకు తీసుకునేది వాళ్లే..
పెండ్లి చేసుకోవడానికి తగిన అమ్మాయి దొరకని బ్రహ్మచారులు, తమ ఇండ్లలోని వయోవృద్ధుల సంరక్షణ కోసం మహిళలు అవసరమైనవారు ఈ సంతలో మహిళలను కిరాయికి తీసుకుంటారని స్థానికులు చెప్తున్నారు.