తిరుమలలో ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో తీశారు. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఈ క్రమంలో క్యూలైన్‌లోని నారాయణగిరి షెడ్స్ కంపార్ట్ మెంట్లో భక్తులు వేచివున్నారు. ఆ కంపార్ట్ మెంట్ తాళాలు తీస్తున్నట్లు హడావిడి చేస్తూ ఫ్రాంక్ వీడియో తీశాడు. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు, భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్‌లో రెండు రోజులు పాటు వానలు
అయితే అతను అలా చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న భక్తులు... వీరిని టీటీడీ సిబ్బందిగా భావించారు. తాళాలు తీస్తున్నారేమోనని ఆశగా చూశారు. కానీ వాసన్, అతని స్నేహితులు వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి పరుగు తీశారు. చూస్తే అది ఫ్రాంక్ వీడియో. దీనిని వారు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.
Here's Video
తిరుమలలో ప్రాంక్ వీడియో చేసిన పోకిరీలు.. విచారణకి ఆదేశించిన విజిలెన్స్ అధికారులు. pic.twitter.com/uovkwowsss
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024
తిరుమల కొండపై ఆకతాయిలు..భక్తులతో ఆటలు #Tirumala #tirupathi #Pranks #AndhraPradesh #lordbalaji pic.twitter.com/mj3et7nGr9
— Mark TV Telugu (@marktvmedia) July 11, 2024
తిరుమల వేంకటేశ్వర స్వామి వారి క్యూలైన్‌లో టీటీఎఫ్ వాసన్ గ్యాంగ్ తీసిన వీడియోలు వైరల్ https://t.co/V2DTjBib0B pic.twitter.com/1q4jtNyrH2
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024
సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు ప్రవేశించే ముందే భక్తుల నుంచి సెల్ ఫోన్లు డిపాజిట్ చేయిస్తారు. నిత్యం భక్తుల గోవింద నామాలతో మారు మ్రోగే తిరుమల కంపార్ట్‌మెంట్‌లలో ఆకతాయిలు చేసిన ఫ్రాంక్ వీడియోపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.