ఈ వార్తను చూస్తే మద్యం ప్రియులు గుండెలు బాదుకుంటారు.. ఆ సమయంలో అక్కడ ఎందుకు లేము అని నిజంగా ఫీల్ అవుతారు.. అక్కడ రెడ్ వైన్ ఏరులై పారింది. కళ్ల ముందే వరదలా పారుతున్న అక్కడి అధికారులు ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. వివరాల్లోకెళితే.. స్పెయిన్ యొక్క విల్లమాలియాలోని విటివినోస్ వైనరీలో రెడ్‌వైన్ నిల్వ ఉంచిన ట్యాంక్ పగిలిపోవడంతో రెడ్‌వైన్ వరదలా (Red Wine Explodes in Spain) పారింది. డ్యామ్ నుంచి నీళ్లను ఎత్తితే ఎంత వేగంగా పరిగెడుతాయో అచ్చం అలాగే ఆ రెడ్ వైన్ వరదలా పారింది.
ఈ విషాద సంఘటన ఐబీరియన్ ద్వీపకల్పానికి ఆగ్నేయంలో ఉన్న విటివినోస్ వైనరీలో (Vitivinos winery) జరిగింది. 1969 నుండి ఉన్న ఈ వైనరీలో 1,570 హెక్టార్లకు పైగా ద్రాక్షతోటలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న ఉద్యోగులు చూస్తూ నిలబడ్డారే తప్ప ఏం చేయలేకపోయారు. వరదలా పారుతున్న రెడ్‌వైన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ క్లిప్‌ను సెప్టెంబర్ 25 న స్థానిక రేడియో స్టేషన్ అయిన రేడియో అల్బాసెట్ (radio station Radio Albacete) ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఇప్పుడు ఇది వేలాది మంది వీక్షణలతో దూసుకుపోతోంది. ఇప్పటికే 8 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. కొంతమంది వినియోగదారులు 1980 భయానక చిత్రం 'ది షైనింగ్' లోని (The Shining) దృశ్యాలను ఈ ఐకానిక్ సన్నివేశంతో పోల్చారు. ఈ వీడియో చూసి మందుబాబులు గుండెలు బాదుకుంటున్నారు. 'దీనమ్మా జీవితం.. ఒక్క చుక్క వైన్ దొరికినా బాగుండు.. ఆ సమయంలో మేం అక్కడా ఉన్న బాగుండు.. ఒక్క చుక్క రెడ్‌వైన్‌ను వదలకుండా తాగేవాళ్లం.' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Watch Video here:
SUCESOS | Reventón de un depósito de vino de unos 50.000 litros en Bodegas VITIVINOS, de Villamalea pic.twitter.com/lU5pIzZAjU
— Radio Albacete (@RadioAlbacete) September 25, 2020
దాదాపు 49 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో రక్తం లాగా కనిపిస్తుండడం చూసి కొందరు భయపడిపోతున్నారు. అయితే దీని వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియకపోయినా, స్థానిక మీడియా ఒక వ్యాట్స్‌లో దెబ్బతినడానికి కారణం కావచ్చునని నివేదించింది. అయితే ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ఏకైక ప్రధాన వైన్ స్పిల్ ఇది కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో, 1,00,000 గ్యాలన్ల క్యాబెర్నెట్ సావిగ్నాన్ కాలిఫోర్నియా నదిలో ఏరులై పారింది. సోనోమా కౌంటీ ద్రాక్షతోటలోని ఒక ట్యాంక్ నుండి 97,000 గ్యాలన్ల రెడ్ వైన్ బయటపడింది.
గత ఏప్రిల్లో, మోడెనాకు సమీపంలో ఉన్న ఒక చిన్న ఇటాలియన్ గ్రామంలో నివసించే ప్రజలు మెరిసే రెడ్ వైన్ నీటికి బదులుగా వారి కుళాయిల నుండి రావడంతో అందరూ బిందెల కొద్ది పట్టుకుపోయారు. అక్కడి నివేదికల ప్రకారం, ఒక వైనరీ అనుకోకుండా స్థానిక నీటి వ్యవస్థలోకి వైన్ పంప్ చేసిన తరువాత ఈ వైన్ ప్రవాహం జరిగిందని తెలిపింది.
ఇక 2018 లో, మరొక వైరల్ క్లిప్ ప్రోసెక్కో వైన్ యొక్క భారీ కంటైనర్ను పొంగిపొర్లుతున్నట్లు చూపించింది. ఇది మెరిసే వైన్ యొక్క భారీ ఫౌంటెన్ను సృష్టించింది. ఈ సంఘటన ఇటాలియన్ ప్రావిన్స్ ట్రెవినోలోని వెనెటోకు సమీపంలో ఉన్న కోనెగ్లియానోలో జరిగింది.