World Population Day 2024

World Population Day 2024 Date and Theme: ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నానాటికి పెరుగుతున్న జనాభా, దీని ద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, అలాగే జనాభా పెరుగుదల సమస్యలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహించడం జరుగుతోంది.

ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది. జూలై 11, 1987న  ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న (డే ఆఫ్ ఫైవ్ బిలియన్) రోజును పురస్కరించుకుని ఆరోజును "ప్రపంచ జనాభా దినం"గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) సమన్వయంతో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) సంయుక్తంగా ప్రతీ ఏడాది ఒక్కో థీమ్‌ను నిర్ణయిస్తాయి. అలాగే ఈ సంవత్సరం కూడా థీమ్ ను నిర్ణయించింది.'ఎవరినీ వదిలిపెట్టవద్దు, ప్రతి ఒక్కరినీ లెక్కించండి (To Leave No One Behind, Count Everyone’) అనేది ఈ సంవత్సరం థీమ్ గా నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచే ప్రపంచం అంతం ప్రారంభం, బాబా వంగా సరికొత్త జోస్యం, ఇంకా ఏం చెప్పారంటే..

ప్రపంచ జనాభా అధికారికంగా ప్రస్తుతం 8 బిలియన్లు దాటేసింది. ఇది ఇలాగే పెరుగుతూ పోతే,  భవిష్యత్ తరాలకు స్థిరమైన, స్నేహపూర్వక అభివృద్దికి అడ్డంకులను సృష్టిస్తుందనేది  ఐరాస ప్రధాన ఆందోళన. అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలు చైనా, భారతదేశం. వందకోట్ల కంటే ఎక్కువ జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. ప్రపంచ జనాభాలో దాదాపు 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక 2050నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్లకు చేరుతుందని  ఐరాస అంచనా.  అలాగే 2080 నాటికి 10.4 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.