సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తాజాగా ఓ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఓ వ్యక్తి (Dattatraya Lohar) తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్‌ వీలర్‌ను తయారుచేశాడు. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్‌ వీలర్‌ను (Dattatraya Lohar Builds Vehicle) తయారుచేశాడతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా (mpressed Anand Mahindra) అయిపోయారు. అందుకే ఆ వీడియోను షేర్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో ఆ కారు ఎలా పని చేస్తుందో కూడా వివరంగా ఉంది. పనిలో పనిగా ఆ వ్యక్తి తయారు చేసిన వాహనం తీసుకుని.. తన కంపెనీ తరపున బొలెరో వాహనాన్ని ఇవ్వాలని ఆనంద్‌ మహీంద్రా ఫిక్సయ్యారు.

తన ట్వీట్ లో ఇది నిబంధనలకు అనుగుణంగా లేకపోవచ్చు. కానీ తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాన్ని చూపెట్టే మన ప్రజల చాతుర్యాన్ని మెచ్చుకోకుండా నేను ఉండలేను’’.. అంటూ ట్విటర్‌ వేదికగా పెద్దగా చదువుకోని ఆ ‘ఇంజినీర్‌’పై ప్రశంసలు గుప్పించాడు. హిస్టోరికానో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రకారం.. ఆ ఆవిష్కరణ చేసిన వ్యక్తి పేరు దత్తాత్రేయ లొహార్‌. ఊరు మహారాష్ట్రలోని దేవ్‌రాష్‌ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు. పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)