ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వడంతో ఆ చిత్ర యూనిట్ సినీ ప్రమోషన్ లలో బిజీగా ఉన్నారు. సినిమా యూనిట్ విజ‌య‌వాడ‌లోని క‌న‌క‌దుర్గ ఆల‌యాన్ని సంద‌ర్శించుకోనుంది. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆ సినీ బృందానికి అభిమానులు స్వాగ‌తం ప‌లికారు. కాగా, మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాలో రామ్‌చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎల్లుండి థియేటర్లలోకి రానుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)