అల్లు అర్జున్ ఈ రోజు 40వ‌ పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకుంటున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా బ‌న్నీకి శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్ మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో' అని చిరంజీవి పేర్కొన్నారు. మ‌రోవైపు, అల్లు అర్జున్ త‌న జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి భార్య, పిల్లలతో క‌లిసి సెర్బియాకు వెళ్లినట్లు తెలిసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)