టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశ్వాన్... కేంద్ర సహాయమంత్రులు అనుప్రియ పాటిల్, జయంత్ చౌదరి, రాందాస్ అథవాలే, ఎంపీ ప్రపుల్ పటేల్ హాజరుకానున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. సినీ నటులు చిరంజీవి, రజినీకాంత్ హాజరయ్యారు.  సీఎంగా బాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. ఏపీలో కొలువుదీరనున్న 24 మంది మంత్రుల జాబితా విడుదల.. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే.. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)