Hyderabad, March 13: 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలోని 'నాటునాటు' (Natu Natu) పాట ఆస్కార్ అవార్డును (Oscar Award) సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాటకు అకాడెమీ అవార్డు రావడంపై యావత్ దేశం ఆనందంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది భారతీయులంతా ఎంతో గర్వించదగ్గ సమయమని చిరంజీవి అన్నారు. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, తారక్, చరణ్, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. మనకు ఇంతటి కీర్తీని తీసుకొచ్చిన విజనరీ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
Mega Star @KChiruTweets Garu Congratulated Whole @RRRMovie Team On Winning Oscar Award For The Best Original Song 😍🔥🔥🇮🇳
Proud Moment For All Of Us 💥#MegastarChiranjeevi #Chiranjeevi#Oscars95 #Oscars#NaatuNaatu pic.twitter.com/4W35VolFiA
— Mega Family Fans (@MegaFamily_Fans) March 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)