స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మం‍గళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం వారికి మగ బిడ్డ పుట్టినట్లు తాజాగా కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు, ఆమె సోదరి నిషా అగర్వాల్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. అలాగే నిషా అగర్వాల్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్‌ చేసింది. ఈ సందర్భంగా తమ కుమారుడి పేరు నీల్‌ కిచ్లుగా గౌతమ్‌ ధృవీకరించాడు. 2020 అక్టోబర్‌ 30న తన స్నేహితుడు, ముంబై వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో కాజల్‌ తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. . అప్పటి నుంచి బేబీ బంప్‌ ఫొటోలను, భర్త గౌతమ్‌ కలిసి బేబీ బంప్‌ ఫొటోషూట్‌లను షేర్‌ చేస్తూ వచ్చింది. తాజాగా పండంటి బాబుకు జన్మనిచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Gautam Kitchlu (@kitchlug)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)