ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రముఖ తెలుగు నటుడు కృష్ణ విగ్రహాన్ని కమల్ హాసన్ ఆవిష్కరించారు. ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్ కోసం కమల్ హాసన్ విజయవాడలో ఉన్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నగరంలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ దేవినేని అవినాశ్‌తో కలిసి కమలహాసన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాశ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజల అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు.
ఆయన వారసుడు మహేశ్‌బాబు సినీ రంగంలో తనదైన ముద్ర వేయడంతోపాటు సేవా రంగంలోనూ ముందున్నారని కొనియాడారు. షూటింగ్స్‌తో నిత్యం బిజీగా ఉండే కమలహాసన్ విజయవాడ వచ్చి కృష్ణ విగ్రహన్ని ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని, విజయవాడ ప్రజలు, కృష్ణ, మహేశ్‌బాబు అభిమానుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.
Here's Video
#WATCH | Kamal Haasan unveils statue of veteran Telugu actor Krishna in Andhra Pradesh's Vijayawada pic.twitter.com/7fpKFWcaYT
— ANI (@ANI) November 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)