Hyderabad, Aug 28: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన తాజా చిత్రం జైలర్ (Jailer) బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే ఈ సినిమాపై ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఓ పాత్రధారి ఆర్సీబీ జెర్సీ వేసుకుని హీరో కోడలిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడతాడు. తమ జెర్సీ వేసుకున్న వ్యక్తితో అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయించారంటూ ఆర్సీబీ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం... జైలర్ సినిమా నుంచి సదరు సన్నివేశాన్ని తొలగించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది.

APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. గ్రూప్ 1లో 89, గ్రూప్ 2లో 508 పోస్టుల భర్తీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)