ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా స్పందించారు. ఎరుపు రంగు చీరలో వచ్చిన మిల్కీ బ్యూటీని ప్రధాన ద్వారం వద్ద మీడియా ప్రతినిధులు మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందన కోరారు. ఆమె మాట్లాడుతూ సామాన్యులు రాజకీయాల్లోకి రావడానికి ఇది దోహదపడుతుందని వ్యాఖ్యానించారు.కాగా కొత్త పార్లమెంట్ భవనంలో కొత్త భవనంలో నిన్న దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
నటి దివ్యా దత్త కూడా పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం చొరవ అద్భుతమన్నారు. ప్రతి అంశంలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు బాగుందన్నారు. కాగా, ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్ కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. క్రికెటర్ మిథాలి రాజ్, బాక్సర్ మేరీకోమ్, హాకీ క్రీడాకారిణి రాణి రామ్‌పాల్, పారాఒలింపిక్ అథ్లెట్ దీపా మెహతా సందర్శించిన వారిలో ఉన్నారు.
Here's Videos
#WATCH | On Women's Reservation Bill, actor Tamannaah Bhatia says, "...This bill will inspire common people to join politics". pic.twitter.com/nbjAq4Aqqd
— ANI (@ANI) September 21, 2023
#WATCH | "This (Women's Reservation Bill) is a big initiative. It feels really good. The women are being brought to the forefront. To witness a special session of Parliament is an experience in itself..," says actor Divya Dutta at Parliament. pic.twitter.com/2CLAtefYfi
— ANI (@ANI) September 21, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)