సూపర్ స్టార్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేశ్‌ బాబు కెరీర్‌లో ఇది 29వది కాగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ కథ అందిస్తున్నారు.

మ‌హేష్‌తో గ్లోబ‌ల్ మూవీగా, యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ జోన‌ర్‌లో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు జక్కన్న ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. RRR సక్సెస్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో మహేశ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని ప్రియాంకనే ధృవీకరించారు. టొరంటో నుండి హైదరాబాద్‌కు వస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు ప్రియాంక. #SSMB29 కోసం హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు.  తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో మంచు ఫ్యామిలీపై కేసులు నమోదు, ఇరు వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

Priyanka Chopra  confirms Mahesh Babu- Rajamouli Movie

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)