ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ.. ప్రకాశ్‌ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయనను రాక్షసుడు అని పిలిచి ఆశ్చర్యపరిచాడు. కృష్ణవంశీ తాజాగా రంగమార్తాండ అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి విదితమే. ప్రకాశ్‌ రాజ్‌కు సంబంధించిన ఎమోషనల్‌ క్లైమాక్స్‌ సీన్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు కృష్ణవంశీ ట్వీటర్‌లో తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘చివరి దశకు చేరుకున్న రంగమార్తాండ. నేను అత్యంత అభిమానించే నటుడు.. నటరాక్షసుడు ప్రకాశ్‌ రాజ్‌తో భావోద్వేగభరితమైన క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న.. స్టన్నింగ్‌’ అంటూ రాసుకొచ్చాడు.

కాగా ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్‌, రాజశేఖర్‌ రెండో కుమార్తె శివాత్మిక కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. నట సామ్రాట్' అనే మరాఠీ సినిమాకి ఇది రీమేక్. విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఈ మూవీ రూపొందుతోంది. కాగా ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించిన ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ చేరుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)