నటి, దర్శకురాలు రేణుదేశాయ్‌, కొడుకు అకీరా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం లక్షణాలు కనిపించగా పరీక్షలు చేస్తే కోవిడ్‌ పాజిటివ్‌ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. నేను ఇది వరకే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నా నాకు కరోనా సోకింది. అకీరాకి వ్యాక్సిన్‌ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కూడా కరోనా వచ్చింది. ఈ థర్డ్‌ వేవ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోండి. మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి' అంటూ రేణు దేశాయ్‌ పేర్కొన్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu (@renuudesai)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)